Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ కు కోహ్లీకి విశ్రాంతి

  • నవంబరు 3 నుంచి భారత్ లో బంగ్లాదేశ్ పర్యటన
  • రోహిత్ శర్మకు టి20 జట్టు పగ్గాలు
  • టెస్టు సిరీస్ కు కోహ్లీనే కెప్టెన్
బంగ్లాదేశ్ జట్టుతో వచ్చే నెలలో జరిగే టి20 సిరీస్ కు టీమిండియాను ఎంపిక చేశారు. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. కోహ్లీకి బదులు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టి20 జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. అటు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు కూడా భారత జట్టును ప్రకటించారు. టెస్టు సిరీస్ కు మాత్రం కోహ్లీనే కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. నవంబరు 3 నుంచి టి20 సిరీస్ జరగనుండగా, నవంబరు 14 నుంచి టెస్టు సిరీస్ షురూ అవుతుంది.

టి20 సిరీస్ కు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, యజువేంద్ర చాహల్, రాహుల్ చహర్, దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్.

టెస్టు సిరీస్ కు భారత జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శుభ్ మాన్ గిల్.
Virat Kohli
India
Bangladesh
Cricket

More Telugu News